మేడిగడ్డది ముమ్మాటికీ పేల్చివేతనే
‘మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు సాధారణ ఘటన కాదు. అది ముమ్మాటికీ పేల్చివేతే. డ్యామ్‌ను కూల్చేందుకు నాడు కుట్ర జరిగింది. ఈ కుతంత్రంపై పోలీస్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కోరారు.
- ట్యాపింగ్‌పై కాదు.. బరాజ్
- కూల్చివేత కుట్రపై సిట్ వేయాలి
- ఆర్ఎస్పీ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు సాధారణ ఘటన కాదు. అది ముమ్మాటికీ పేల్చివేతే. డ్యామ్‌ను కూల్చేందుకు నాడు కుట్ర జరిగింది. ఈ కుతంత్రంపై పోలీస్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కోరారు. పోలీస్ శాఖ సిట్ ఏర్పాటు చేయాల్సింది ఫోన్ ట్యాపింగ్‌పై కాదని, మేడిగడ్డను కూల్చేందుకు జరిగిన కుట్ర పైనేనని పేరొంటూ తెలంగాణ డీజీపీని ఆయన ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ అది పేలుడు కాకపోతే, ఎందుకు కాదో అన్న అంశాన్ని మహదేవ్పూర్ పోలీసులు ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని, చట్టబద్ధమైన ప్రక్రియేనని, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా ట్యాపింగ్ చేస్తున్నదని ఆరోపించారు. డ్యామ్‌ల విధ్వంసంతో పోలిస్తే అది నేరమే కాదని స్పష్టంచేశారు. ట్యాపింగ్ చేయడం వల్ల ఎవరి ప్రాణాలూ పోవని, పైగా ఎందరివో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
డ్యామ్‌ల పేల్చివేతలు అంతర్జాతీయ యుద్ధ నేరం
డ్యాములు, బరాజ్‌లను కూల్చడం, పేల్చివేత చర్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన యుద్ధ నేరంగా పరిగణిస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతోపాటు, సాగు, తాగు నీరు అందక ప్రజలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోతారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టును మళ్లీ బాగు చేయాలంటే వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతుందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారు రూ.2 లక్షల కోట్లతో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి కండ్లముందు ఉంచారని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి ఒక ప్రాజెక్టు కూడా కట్టకపోగా, ఇప్పటికే దాదాపు రూ.50,000 కోట్లు వెనకేసుకున్నారని, పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని తెలిపారు. దీన్నిబట్టి ‘తెలంగాణ ప్రస్తుత దుస్థితికి అసలైన ఏ-1 ఎవరు?’ అంటూ రేవంత్‌రెడ్డిని నేరుగా నిలదీశారు.
రాప్తాడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి అత్యంత భయానకమైనదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రేమ పేరుతో హేమంత్ అనే 21 ఏండ్ల యువకుడు పాఠశాలలోకి చొరబడి బాలికపై, ఆమెను కాపాడబోయిన స్నేహితురాలిపై దాడికి తెగబడటం దిగ్భ్రాంతి కలిగించిందని పేరొన్నారు. తెలంగాణలోని షాబాద్ ఘటనతో దీనికి పోలికలు ఉన్నాయని గుర్తుచేస్తూ, ఇలాంటి విద్వేష నేరాల్లో 90 శాతం వరకు బాధితులకు తెలిసిన వ్యక్తులే నేరస్తులుగా మారుతున్నారని వివరించారు. ఇలాంటి పెడ ధోరణలను కేవలం పోలీసులే కాకుండా సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

