పదవి ముగిసినా పాతోళ్లే
తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పదవీ కాలం ముగిసినా కొందరు సభ్యులు అధికారిక హోదాను వీడటం లేదు. ఆఫీసును వదలడం లేదు. మాజీలైనా ఇంకా కమిషన్ సభ్యులుగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు దర్జాగా వెళ్తున్నారు.
- సొంత అడ్డాగా విద్యా కమిషన్ ఆఫీస్
- సెప్టెంబర్‌లోనే ముగిసినా అవే హోదాల్లో
- వెబ్సైట్లోనూ పాత కమిషన్ సభ్యులే
- విద్యారంగ నిపుణుల విస్మయం
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పదవీ కాలం ముగిసినా కొందరు సభ్యులు అధికారిక హోదాను వీడటం లేదు. ఆఫీసును వదలడం లేదు. మాజీలైనా ఇంకా కమిషన్ సభ్యులుగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు దర్జాగా వెళ్తున్నారు. కార్లపై హోదా బోర్డులు.. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ విద్యా కమిషన్‌లో ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం 2024 అక్టోబర్ 18న జీవో జారీచేసింది.
కమిషన్ చైర్పర్సన్ కాల పరిమితితోనే సభ్యుల పదవీకాలం ముగుస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదు. చైర్పర్సన్ పదవీ కాలం సెప్టెంబర్ 6న ముగిసింది. అంటే అదేరోజు సభ్యుల పదవీకాలం కూడా ముగిసినట్టే. అయినా అవే హోదాలను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్యాలయమే అడ్డా.. కారుపై హోదా
కమిషన్ గడువు ముగిసినా ఓ మాజీ సభ్యుడు ఇంకా పీఠం వదలడం లేదు. కమిషన్ ఆఫీసును అధికారికంగా వాడేస్తున్నారు. తన అనుచరులతో సమావేశాలకు ఆఫీసునే అడ్డాగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. తన కారు నంబర్ ప్లేట్‌పైనా ‘విద్యా కమిషన్ మెంబర్’ అనే హోదాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అక్టోబర్‌లో విద్యా కమిషన్ కార్యాలయంలోనే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో విద్యా కమిషన్ సభ్యుడి హోదాలో ఉన్నట్టు ఓ మాజీ ప్రచారం చేసుకుంటున్నారు.
కమిషన్ మాజీ సభ్యుడొకరు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ‘ఓటు బచావో -దేశ్ బచావో’ ర్యాలీలో పాల్గొన్నారు. ఏకంగా విద్యా కమిషన్ సభ్యుడి హోదాలో పాల్గొన్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అధికారిక హోదాను ప్రస్తావించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విద్యా కమిషన్ వెబ్సైట్లోనూ చైర్ పర్సన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. దానిని అప్డేట్ చేయకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

