పడుతూ.. లేస్తూ పయనం!
తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభాల్లోకి వచ్చాయి. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,335.70 పాయింట్లు లేదా 1.82 శాతం పెరిగి 74,459.53 వద్ద నిలిచింది.
- క్యూ2 ఆర్థిక ఫలితాలు, గల్ఫ్ వార్‌పై మదుపర్ల దృష్టి
- మార్కెట్ పల్స్
తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభాల్లోకి వచ్చాయి. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,335.70 పాయింట్లు లేదా 1.82 శాతం పెరిగి 74,459.53 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 453.10 పాయింట్లు లేదా 2 శాతం పుంజుకొని 23,053.10 దగ్గర ఆగింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు కలిసొచ్చాయి.
అయితే ఈ వారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయ త్రైమాసికానికి (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)గాను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు కీలకమని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే సూచీలు నష్టాల వైపునకు, తగ్గితే లాభాలను సంతరించుకోవచ్చు. ఇక అమెరికా మార్కెట్లను కృత్రిమ మేధస్సు (ఏఐ) భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఇక్కడా కనిపించేందుకు ఆస్కారం ఉన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలూ ప్రధానమే.
అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం కూడా మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేయగలవు. ఈ వారం బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఆయిల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్ల కదలికలు మార్కెట్ తీరుతెన్నులను శాసించగలవని మెజారిటీ నిపుణుల అభిప్రాయం. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,700 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,300-23,500 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని కూడా అత్యధిక ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

