దుబాయ్: ఆఫ్ఘనిస్తాన్పై అజేయ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశాడు. కోహ్లీ ఆ మ్యాచ్‌లో 61 బంతుల్లో 122 రన్స్ చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత సెంచరీ(71) లోటును తీర్చుకున్న కోహ్లీ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తొలుత రోహిత్ హిందీలో ఓ ప్రశ్న వేశాడు. రోహిత్ హిందీ స్టయిల్‌పై కామెంట్ చేసిన కోహ్లీ మాట్లాడుతూ.. ఈ ఫార్మాట్లో సెంచరీ చేస్తాననుకోలేదన్నాడు. చాలా సంతోషంగా ఉందని, ఆశ్చర్యంగా కూడా ఉందని కోహ్లీ తెలిపాడు. రాబోయే రెండు నెలలు ఇండియాకు కీలకమని, ఆస్ట్రేలియాలో వరల్డ్‌కప్ ఆడేందుకు వెళ్తామని, అక్కడ ఇలాంటి ఫామ్‌నే కొనసాగించాలని ఆశిస్తున్నట్లు కోహ్లీ చెప్పాడు. జట్టులో క్వాలిటీ ఉందని, ఆస్ట్రేలియాకు వెళ్లి, తొలి గేమ్ నుంచే రాణిస్తామని భావిస్తున్నట్లు విరాట్ తెలిపాడు. కోహ్లీ ఖాతాలో 27 టెస్టు, 43 వన్డే సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో విరాట్ ఖాతాలో ఒకే సెంచరీ ఉంది. విరాట్‌ను రోహిత్ ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇదే.
What happens when @ImRo45 interviews @imVkohli ☺️ 👏
Laughs, mutual admiration & a lot of respect 😎- by @ameyatilak
Full interview 📽️https://t.co/8bVUaa0pUw #TeamIndia | #AsiaCup2022 | #INDvAFG pic.twitter.com/GkdPr9crLh
— BCCI (@BCCI) September 9, 2022