న్యూఢిల్లీ, మే 2: రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్ నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన రవి శంకర్ పదవీకాలం శనివారంతో ముగియడంతో ఆయన స్థానాన్ని జైన్ భర్తీ చేయనున్నారు. ప్రధాని అధ్యక్షతన అపాయింట్మెంట్ కబిటీ ఆఫ్ ది క్యాబినెట్ సమావేశమై ఈ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
జైన్ ప్రస్తుతం రిజర్వుబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ చట్టం-1934 ప్రకారం సెంట్రల్ బ్యాంక్‌లో నలుగురు డిప్యూటీ గవర్నర్లు, మరో ఇద్దరు అదేస్థాయి హోదా కలిగిన వ్యక్తులు, మరొకరు కమర్షియల్ బ్యాంకర్ ఉండాలి. మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లుగా స్వామినాథన్, జే పూనమ్ గుప్తా, ఎస్సీ ముర్ము విధులు నిర్వహిస్తున్నారు.