నిజామాబాద్: జిల్లాలోని మోపాల్ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని కులాస్పూర్లో బుధవారం తెల్లవారుజామున ఆరు ఇండ్లలో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇండ్లలో ఉన్న 22 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.6 లక్షల చోరీ చేశారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీకి గురైన ఇండ్లను పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.