Road Accident : నేపాల్ (Nepal) దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు (Private Jeep) అదుపుతప్పి 700 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ (Nepal) రోల్పా జిల్లా (Rolpa District) లోని పర్వత ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు జల్జలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిందని అధికారులు తెలిపారు. వర్షం కారణంగా బురద ఏర్పడి వాహనం జారి పడిందని పోలీసులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. ఘటన సమయంలో వాహనంలో ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదని అధికారులు చెప్పారు.