పాట్నా: బీహార్లో బీజేపీకి జలక్ తగిలింది. బొచ్చహన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించింది. ఆ స్థానం నుంచి అమర్ కుమార్ పాశ్వాన్ ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేశారు. అమర్ సుమారు 35 వేల ఓట్ల తేడాతో సమీప బీజేపీ అభ్యర్థి బీబీ కుమారిపై విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం గతంలో వీఐపీ పార్టీ సొంతం. అయితే ఈ సారి వికాశ్శీల్ ఇన్సాన్ పార్టీ తరపున పోటీ చేసిన గీతా కుమారి ఓడిపోయారు. ఎమ్మెల్యే ముసాఫిర్ పాశ్వాన్ చనిపోవడం వల్ల ఈ సీటుకు బైపోల్ నిర్వహించారు. అయితే ముసాఫిర్ .. వీఐపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.