న్యూఢిల్లీ: దేశంలోని వేర్వేరు హైకోర్టు బార్ అసోసియేషన్ల అధ్యక్షులు సీజేఐ సంజీవ్ ఖన్నాను గురువారం కలిసి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సీజేఐని కలిశాక కర్ణాటక హైకోర్టు బార్ మాట్లాడారు. ఈ విషయంలో సమగ్ర విచారణ చేయిస్తామని సీజేఐ తమకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. జస్టిస్ వర్మపై క్రిమినల్ న్యాయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆయన బదిలీ ఆపాలని వివిధ హైకోర్టు బార్ అసోసియేషన్లు కోరాయి. జస్టిస్ వర్మను పరిపాలన, న్యాయ పరమైన విధులకు దూరంగా ఉంచాలని అవి డిమాండ్ చేశాయి. వర్మ బదిలీని ఉపసంహరించకపోతే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సమ్మెకు మద్దతుగా సమావేశం కావాలని అన్ని రాష్ర్టాల హైకోర్టు బార్ అసోసియేషన్ల అధ్యక్షులు నిర్ణయించారు.