ఎదులాపురం,జనవరి 7: కుల సంఘాల సభ్యులు ఐక్యంగా ఉంటూ సంఘ అభ్యున్నతికి పాటు పడాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. జిల్లా కేంద్రంలోని తాలూకా మున్నూర్ కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ సంఘం కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత వి విధ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఎటువంటి సమస్యలున్నా సంఘ సభ్యులు ఐక్యంగా ఉండి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. సంఘం అభివృద్ధికి తన వంతుగా సహకా రం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కే విఠల్, కలాల శ్రీనివాస్, కోశాధికారి కె.జైపాల్ , ఎంపీపీలు గండ్రత్ రమేశ్, మార్శెట్టి గోవర్ధన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత తదితరులున్నారు.
మైనార్టీ శాఖపై సమీక్ష
ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖపై కార్యాలయంలో ఎమ్మె ల్యే జోగు రామన్న శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ పథకాలు, గురుకుల నిర్వహణ, గురుకుల భవనాలు, స్కాలర్షిప్లు, రుణాలు, మైనార్టీల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్నకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం బంగారి గూడలోని మై నార్టీ గురుకులంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులైన పలువురు సిబ్బందికి నియామకపత్రాలను అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, కలీం, హసీబ్, శ్యామ్దినకర్, ఇమ్రాన్‌ఖాన్, అబిద్ అలీ తదితరులున్నారు.
నారాయణ పారాయణం కార్యక్రమంలో ఎమ్మెల్యే
సనాతన హిందూ ధర్మ విశిష్టతను చాటి చెప్పేలా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని దక్షిణ ముఖి హనుమాన్ ఆలయాన్ని శనివారం ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చే శారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో రామాయణ పారాయణాన్ని ఏర్పాటు చేయగా, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన మహాన్నదానంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. అతిథులను శాలువా, పుష్పగుచ్ఛాలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల వారికీ ప్రాధాన్యతనిస్తూ అందరి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, నాయకులు పండ్ల శ్రీను, బండారి దేవ న్న, పసుపుల రాజు, న్యాయవాది శ్రవాణ్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.