Revanth Reddy | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల హకుల కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన పోరాటం ద్వారా రాహుల్‌గాంధీ జాతీయ స్థాయిలో మైలేజ్ సాధించే ప్రయత్నం చేశారు. అది గమనించి పలు రాష్ట్రాల కాంగ్రెస్ అగ్రనేతలు, మిత్రపక్ష నాయకులు ఢిల్లీకి చేరుకొ ని రాహుల్ పకన నిలబడ్డారు. కానీ 72 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన రేవంత్‌రెడ్డి మాత్రం ఈ నిరసనకు దూరంగా ఉండిపోయారు. రాహుల్‌కు అండగా నిలవాల్సిన కీలక తరుణంలో డుమ్మా కొట్టడంపై తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా ఏఐసీసీ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.
ఢిల్లీలో సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌లో జరిగిన లాఠీచార్జ్‌ను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నది. పోలీసు చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రోడ్డెకారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొకుతున్నదంటూ రాహుల్‌గాంధీ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసం ఎదుట అకస్మాత్తుగా ధర్నాకు దిగారు. రాహుల్, ప్రి యాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ నిరసన తీవ్ర ఉతంఠకు, హైడ్రామాకు దారితీసింది. అగ్రనేతలంతా ధర్నా చేస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే కర్ణాటక, కేరళ సీఎంలు డీకే శివకుమార్, వీడీ సతీశ న్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్ రాజావారింగ్, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పవన్‌ఖేడా, దీపేందర్‌సింగ్ హూడా, ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎంపీ సుప్రియా సూలే తదితరులు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ధర్నాలో పాల్గొని రాహుల్‌కు మద్దతుగా నిలిచారు.
రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఇంత కీలకమైన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. విద్యార్థుల ను, యువతను కాంగ్రెస్ పార్టీవైపు మళ్లించుకునే అవకాశం ఉన్న సమయంలో ‘బిజీ షెడ్యూల్’ పేరుతో నిరసనలకు దూరంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. అయితే.. బిజీ షెడ్యూల్ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అనే చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న నిరుద్యోగులపై ప్రభుత్వం తరచూ లాఠీచార్జ్‌లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తాను నిరసనల్లో పాల్గొంటే తన మెడకే చుట్టుకుంటుందా? అని రేవంత్‌రెడ్డి అనుమానిస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం ఎందుకు? అనే ఆలోచన కూడా చేశారనే చర్చ జరుగుతున్నది.