హైదరాబాద్ : బీఎల్వోలు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. బీఎల్వోలు ప్రభుత్వ అధికారులు పనులు చేయరు, నిద్రపోతారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ అరెస్టును నిర సిస్తూ బుధవారం కొడంగల్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లా డారు. అధికారులు పని చేయకున్నా వాళ్లకు జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడతాయన్నారు. రోజూ 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోవట్లేదు.
నేను పాలనలో బిజీగా ఉంటే నన్ను దెబ్బ తీయాలని కొందరు కుట్ర చేస్తున్నారనని పేర్కొన్నారు. కొడంగల్‌లో సర్(SIR)నమోదు ఆందోళనకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు 78% నమోదైంది, 22% నమోదు కాలేదు. ఇది నా గెలుపు పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.