UAE Visa | యూఏఈ వీసా ఆన్ అరైవల్.. ఇండియన్స్‌కు న్యూ రూల్స్..!
UAE Visa | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్పవచ్చు. కేవలం భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన యూఏఈలో 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం లభించదు. నిర్దిష్ట దేశాల నుంచి పొందిన వ్యాలిడ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ (నివాస అనుమతి) ఉన్న భారతీయులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.
UAE Visa : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్పవచ్చు. కేవలం భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన యూఏఈలో ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం లభించదు. నిర్దిష్ట దేశాల నుంచి పొందిన వ్యాలిడ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ (నివాస అనుమతి) ఉన్న భారతీయులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. విదేశాల్లో నివసించే లేదా ప్రయాణించే భారతీయుల కోసం ప్రయాణ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో యూఏఈ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించింది.
ఈ నేపథ్యంలో ఎవరు అర్హులు, ప్రయాణానికి ముందు ప్రయాణికులు ఏయే విషయాలు చూసుకోవాలనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం పొందాలంటే భారతీయ పౌరులు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వారి సాధారణ పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉండాలి. దీంతోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ తదితర దేశాల నుంచి జారీచేసిన వ్యాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలి.
గతంలో ఈ సౌకర్యం కేవలం అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ లేదా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే 2025 ఫిబ్రవరి 13 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ జాబితాను విస్తరించింది. కొత్తగా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల రెసిడెన్స్ పర్మిట్లు ఉన్న భారతీయులకు కూడా ఈ అర్హతను కల్పించింది.
యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ విస్తరణ యూఏఈలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వర్తిస్తుంది. అయితే అర్హత ఉన్న ప్రయాణికులు తమవెంట కొన్ని డాక్యుమెంట్లను తప్పనిసరిగా ఉంచుకోవాలి. అవేమిటంటే కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న భారతీయ పాస్‌పోర్ట్, అనుమతి పొందిన దేశాల నుంచి జారీ చేయబడిన వ్యాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్.
ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ఇతర సహాయక ప్రయాణ పత్రాలు.
ప్రయాణికులు యూఏఈలోకి ప్రవేశించే తేదీ నాటికి తమ క్వాలిఫైయింగ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ చెల్లుబాటులో ఉందని నిర్ధారించుకోవాలి. ఎయిర్‌లైన్ సిబ్బంది, యూఏఈ ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణానికి లేదా దేశంలోకి ప్రవేశానికి అనుమతించే ముందు ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. సాధారణంగా అర్హత కలిగిన భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు 14 రోజుల వీసా ఆన్ అరైవల్ మంజూరు చేస్తారు.
అవసరమైతే వర్తించే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, రుసుములకు లోబడి ఈ వీసాను మరో 14 రోజులపాటు ఒకసారి పొడిగించుకోవచ్చు. వీసా కేటగిరీలు, సర్వీస్ ఫీజులు మారే అవకాశం ఉన్నందున ప్రయాణికులు బయలుదేరే ముందు యూఏఈ ఇమ్మిగ్రేషన్ అధికారులతో గానీ, తమ ఎయిర్లైన్తోగానీ తాజా నిబంధనలు మరి ఛార్జీలను నిర్ధారించుకోవడం మంచిది. కేవలం భారతదేశం వెలుపల నివసించడం మాత్రమే ఈ వీసాకు అర్హత కాదు.
ప్రయాణికుడు తప్పనిసరిగాపైన పేర్కొన్న అర్హత గల దేశాలలో ఒకదాని నుండి వ్యాలిడ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్‌ను కలిగి ఉండాలి. ఈ జాబితాలోలేని దేశాలలో నివసించే భారతీయులు, ప్రయాణానికి ముందే యూఏఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విస్తరణవల్ల కెనడా, ఆస్ట్రేలియాలలో ఉన్న అనేక మంది భారతీయ ప్రయాణికులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రాథమిక నియమం స్పష్టంగా ఉంది. కేవలం భారత పాస్‌పోర్ట్ మాత్రమే ఈ సదుపాయానికి అర్హత కాదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

