హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ): ఇటీవల హైదరాబాద్ శివారు తుకుగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సు హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం.. సమగ్రంగా మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్న నేపథ్యంలో దర్యాప్తును అత్యం త పకడ్బందీగా పూర్తిచేయాలని ఆదేశించారు.
దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను వీలైనంత వేగంగా పూర్తిచేసి సమగ్ర చార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.