మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మహబూబ్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లి హజ్‌హౌస్‌లో మంత్రులు మహమూద్ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్ సహకారంతో మైనారిటీలు ఆర్థికంగా ఎదిగేందుకు తనవంతు కృషి చేస్తానని ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు హాజరయ్యారు.