మోర్తాడ్, మే 9: మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా దోచుకుంటున్నారని, క్విం టాల్‌కు పదికిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్, మోర్తాడ్‌లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేముల.. అదనపు కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతుల సమస్యలను విన్నవించారు.
ఒక దశలో అదనపు కలెక్టర్‌ను ఫోన్లో నిలదీశా రు. ‘ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కలెక్టర్ ఎత్తడం లేదు? నాలుగుసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. మిల్లర్ల దౌర్జన్యం పెరిగింది. ధాన్యం దిం చుకుంట లేరు. రెండు రోజులు ఉంచుకొని లారీలను వాపస్ కొడుతున్నరు. ఇంత జరుగుతున్నా ఏంచేస్తున్నరు? మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మేం గతంలో ఓ రెండు మిల్లులను సీజ్ చేసినం. మీరు కూడా చేయండి. దారికొస్తరు’ అని అదనపు కలెక్టర్‌కు సూచించారు. గతంలో సంచికి 41.5 కిలోలు మాత్రమే తీసుకునేవారని, ఇప్పుడు కొందరు 45 కిలోలు అడుగుతుంటే ప్రభుత్వం ఎందు కు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.