Road repair works | సారంగాపూర్, జూన్ 25: బీర్ పుర్ మండలంలోని కొల్వాయి గ్రామం నుండి చిన్నకొల్వాయి వెళ్లె ప్రధాన రహదారి తారురోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని వర్షాలు కురిస్తే అటుగా వెళ్లెందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు విన్నవించుకున్నారు. ఈ మేరకు పలువురు బుధవారం వినతి పత్రం అందజేశారు.
బీర్ పూర్ మండల కేంద్రానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాగా కొల్వాయి, చిన్న కొల్వాయి గ్రామస్తులు, నాయకులు రహదారి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే కొల్వాయి గ్రామంలోని ప్రధాన రహదారిపై గంతలు ఏర్పాడ్డాయని వాటి మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకిస్టు గంగాధర్, అగస్టిన్, చిక్రం అంజి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.