అర్వపల్లి ఆలయానికి పునర్వైభవం
- పూర్తిస్థాయిలో యోగానందుడి ఆలయాభివృద్ధి
- పనుల వేగవంతానికి చర్యలు
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- పురోగతిపై ఎమ్మెల్యే కిశోర్, అధికారులతో సమీక్ష
అర్వపల్లిలోని చారిత్రక యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు
తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ తన సొంత నిధుల నుంచి 1.20 కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. వాటి పురోగతిపై శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గర్భాలయం, ధ్వజ స్తంభం గాలి గోపురం, ఆలయం చుట్టూ ప్రాకారం, రథశాల, యాగ మండపం, జాతీయ రహదారుల కూడలి వద్ద సింహ ద్వారం
నిర్మాణాలపై చర్చించారు.
అర్వపల్లిలోని చారిత్రక యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ తన సొంత నిధుల నుంచి 1.20 కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. వాటి
పురోగతిపై శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గర్భాలయం, ధ్వజ స్తంభం గాలి గోపురం, ఆలయం చుట్టూ ప్రాకారం, రథశాల, యాగ మండపం, జాతీయ రహదారుల కూడలి వద్ద సింహ ద్వారం
నిర్మాణాలపై చర్చించారు.
అర్వపల్లి, మార్చి 11 : అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధి పనులపై శుక్రవారం ఆయన అసెంబ్లీలోని తన చాంబర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.1.20కోట్లతో చేపట్టిన గర్భాలయ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధ్వజ స్తంభం ఏర్పాటు, గాలి గోపురం, ఆలయ ప్రాకారం, రథశాల, యాగ మండపం, జాతీయ రహదారుల కూడలి వద్ద సింహద్వారం నిర్మాణాలపై చర్చించారు. సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, స్తపతి ఆనందవేలు, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, అర్చకులు రాంబాబు అయ్యంగార్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

