న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రభంజనం కొనసాగుతున్నది. గత నెలకుగాను సెకన్‌కు 21.9 మెగాబైట్ల 4జీ డాటా డౌన్లోడ్ స్పీడ్‌తో అగ్రస్థానంలో నిలిచిందని ట్రాయ్ తాజాగా వెల్లడించింది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ 4జీ డాటా డౌన్లోడ్ స్పీడ్ 13.2 ఎంబీపీఎస్ కాగా, వొడాఫోన్ ఐడియా 15.6 ఎంబీపీఎస్‌గా ఉన్నది. మరోవైపు, అప్‌లోడ్‌లో 7.6 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్ తొలి స్థానంలోనే కొనసాగుతున్నది.