హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ వీటిని శుక్రవారం వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రొవిజినల్ ఆన్సర్కీని ఈనెల 2న విడుదల చేస్తారు. విద్యార్థులు ఈనెల 3 వరకు కీపై అభ్యంతరాలు తెలుపవ చ్చు. 9న ఫలితాలు విడుదల చేస్తారు. కా గా ఈ పరీక్షను మే 26న నిర్వహించారు.