– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
కొత్తగూడెం గణేష్ టెంపుల్, అక్టోబర్ 03 : నవంబర్ 1, 2023 నాటికి ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా పాసైన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉచిత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సూచనల మేరకు ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు సంకుబాపన అనుదీప్, వేముల ప్రసాద్ బాబు, కరాటే శ్రీను, కన్ని, అన్వర్, పూర్ణ, మనోజ్, ఈమంది గణేష్, ఎమునూరిశివ, మదాసు పద్మ, షరీఫ్, అంబుల వేణు గోపాల్, జున్నరు రాజేష్ గౌడ్, షణ్ముఖ, సోహెబ్, సచిన్, రాకేష్ రెడ్డి వేణు పాల్గొన్నారు.