చుంచుపల్లి, జూలై 09 : హైదరాబాద్ ప్రాంతీయ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కార్యాలయానికి చెందిన ప్రజారోగ్య నిపుణుడు డా.వరుణ్ విజయ్ గైకి గురువారం చుంచుపల్లి మండలం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దన్బాద్–2 ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డా.వరుణ్ విజయ్ గైకికి పెనగడప పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ హరీష్ సాదర స్వాగతం పలికారు. అనంతరం పీహెచ్సీ, ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫార్మసీ స్టోర్, ఐఎల్ఆర్ (Ice Lined Refrigerator), వైద్య రికార్డులు, ఇతర పరిపాలనా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సేవల నిర్వహణ, మందుల నిల్వ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.