సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 7గంటల నుంచే మొదలైన ఎండల తీవ్రత సాయంత్రం 6 వరకు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగత్రలను నమోదవుతున్నాయి.
హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలను 27.7డిగ్రీలు, గాలిలో తేమ 51 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.