RCB vs GT : ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్లో మరో రసవత్తర పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఆహ్మదాబాద్ వేదికగా రాయల్ చాలెంజర్ బెంగళూరు(Royal Challenger Bangalore), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి డూప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై గెలిచిన ఊపులో ఉన్న ఆర్సీబీ మరో విజయంపై కన్నేసింది. ఈ ఎడిషన్‌లో రెండు విజయాలతో టేబుల్లో చివరి స్థానంలో కొనసాగుతున్న ఆర్సీబీ మరో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. కాగా, మళ్లీ తుది జట్టులోకి మ్యాచ్‌లోకి మ్యాక్స్‌వెల్ వచ్చి చేరాడు.