IPL Centurions: పొట్టి ఫార్మాట్‌కు ఫుల్ క్రేజ్ తెచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో సెంచరీల శతకం పూర్తి అయింది. 2008 ఆరంభ సీజన్ నుంచి ఇప్పటివరకూ వంద సెంచరీలు నమోదయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ హిట్టర్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullam)తో మొదలు.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్(Sai Sudarshan) వరకు సెంచరీ కొట్టిన చిచ్చరపిడుగులు చాలామందే. అయితే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు నమోదైంది మాత్రం పదిహేడో సీజన్లోనే.
మార్చి 22న పదిహేడో సీజన్ షురూ కాగా.. ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) తొలి వంద కొట్టాడు. విరాట్ విజృంభణను మరువకముందే రాజస్థాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్(Jos Buttler) రెండు శతకాలతో గర్జించాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రాజస్థాన్ కుర్ర కెరటం యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ తరంగం సాయి సుదర్శన్‌లు వంద కొట్టి మురిసిపోయారు.
కోహ్లీ, ట్రావిస్ హెడ్
భారత క్రికెటర్లకు తామేమీ తక్కువ కాదన్నట్టు కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్, బెంగళూరు ఆల్‌రౌండర్ విల్ జాక్స్(Will Jacks), లక్నోసూపర్ జెయింట్స్ విధ్వంసక ఆటగాడు మార్కస్ స్టోయినిస్, సన్‌రైజర్స్ చిచ్చరపిడిగు ట్రావిస్ హెడ్ (Travis Head), పంజాబ్ కింగ్స్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోలు శతకనాదంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
The IPL now has 101 centuries with 14 in 2024 – the most in a season 🔥 pic.twitter.com/h9ni1177tR
— ESPNcricinfo (@ESPNcricinfo) May 11, 2024
సీజన్ల వారీగా చూస్తే తొలి సీజన్లో ఆరు, 2009లో రెండు శతకాలు నమోదయ్యాయి. ఆ తర్వాత సీజన్ నుంచి హిట్టర్ల విధ్వంసానికి బౌలర్లు కుదేలయ్యారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీ పేరిట ఉంది. విరాట్ 8 శతకాలు బాదగా.. జోస్ బట్లర్ ఏడు, క్రిస్ గేల్ ఏడు సార్లు వంద కొట్టాడు.
2008 – ఆరు సెంచరీలు నమోదయ్యాయి. మెక్కల్లమ్(158 నాటౌట్, కోల్‌కతా), మైక్ హస్సీ(116 నాటౌట్ చెన్నై), ఆండ్రూ సైమండ్స్(117 నాటౌట్, దక్కన్ చార్జర్స్), ఆడమ్ గిల్ క్రిస్ట్ (109 నాటౌట్, దక్కన్ చార్జర్స్), సనత్ జయసూర్య(114 నాటౌట్, ముంబై ఇండియన్స్), షాన్ మార్ష్(115 పంజాబ్ కింగ్స్).
మెక్కల్లమ్(158 నాటౌట్)
2009 – ఈ సీజన్లో ఏబీ డివిలియర్స్(105 నాటౌట్, ఢిల్లీ), మనీశ్ పాండే(114 నాటౌట్ ఆర్సీబీ)లు మాత్రమే వంద కొట్టారు.
2010 – యుసుఫ్ పఠాన్ (100, రాజస్థాన్), డేవిడ్ వార్నర్(107 నాటౌట్, ఢిల్లీ), మురళీ విజయ్(127, సీఎస్కే), మహేల జయవర్దనే ( 110 నాటౌట్, పంజాబ్ కింగ్స్)
2011 – పాల్ వాల్తటి (120 నాటౌట్, పంజాబ్), సచిన్ టెండూల్కర్(100 నాటౌట్, ముంబై), క్రిస్ గేల్ (102 నాటౌట్, ఆర్సీబీ), వీరేంద్ర సెహ్వాగ్(119, ఢిల్లీ), క్రిస్ గేల్(107), ఆడమ్ గిల్‌క్రిస్ట్(106, పంజాబ్)
2012 – అజింక్యా రహానే(103 నాటౌట్, రాజస్థాన్), కెవిన్ పీటర్సన్(103 నాటౌట్, ఢిల్లీ), డేవిడ్ వార్నర్(109 నాటౌట్, ఢిల్లీ), రోహిత్ శర్మ(109 నాటౌట్, ముంబై), క్రిస్ గేల్(128 నాటౌట్, ఆర్సీబీ), మురళీ విజయ్(113, చెన్నై).
క్రిస్ గేల్(128 నాటౌట్)
2013 – షేన్ వాట్సన్(101, రాజస్థాన్), క్రిస్ గేల్(175 నాటౌట్, ఆర్సీబీ), సురేశ్ రైనా(100 నాటౌట్, సీఎస్కే), డేవిడ్ మిల్లర్(101 నాటౌట్, పంజాబ్).
2014 – లెండిల్ సిమన్స్(100 నాటౌట్, ముంబై), సెహ్వాగ్(122, పంజాబ్), వృద్దిమాన్ సాహా(115 నాటౌట్, పంజాబ్).
2015 – మెక్ కల్లమ్(100 నాటౌట్, చెన్నై), క్రిస్ గేల్(117, ఆర్సీబీ), డివిలియర్స్(133 నాటౌట్, ఆర్సీబీ), షేన్ వాట్సన్(104 నాటౌట్, రాజస్థాన్).
2016 – క్వింటన్ డికాక్(108, ఢిల్లీ), విరాట్ కోహ్లీ(100 నాటౌట్, 108 నాటౌట్, 109, 113, ఆర్సీబీ), స్టీవ్ స్మిత్(101, రైజింగ్ పూపే జెయింట్స్), డివిలియర్స్(129 నాటౌట్, ఆర్సీబీ).
2017 – సంజూ శాంసన్ (102, ఢిల్లీ), హషీమ్ ఆమ్లా(104, 104 నాటౌట్, పంజాబ్), డేవిడ్ వార్నర్(126, హైదరాబాద్), బెన్ స్టోక్స్(103 నాటౌట్, రైజింగ్ పూణే జెయింట్స్),
2018- క్రిస్ గేల్(104 నాటౌట్, పంజాబ్), షేన్ వాట్సన్(106, 117 నాటౌట్, చెన్నై), రిషభ్ పంత్(128 నాటౌట్, ఢిల్లీ), అంబటి రాయుడు(100 నాటౌట్, చెన్నై).
2019- సంజూ శాంసన్(102 నాటౌట్, రాజస్థాన్), బెయిర్‌స్టో(114, హైదరాబాద్), వార్నర్(100 నాటౌట్, హైదరాబాద్), కేఎల్ రాహుల్(100 నాటౌట్, పంజాబ్), విరాట్ కోహ్లీ(100, ఆర్సీబీ), రహానే(105 నాటౌట్, రాజస్థాన్)
2020- కేఎల్ రాహుల్(132 నాటౌట్, పంజాబ్), మయాంక్ అగర్వాల్(106 పంజాబ్), శిఖర్ ధావన్(101 నాటౌట్, ఢిల్లీ), బెన్ స్టోక్స్(107 నాటౌట్, రాజస్థాన్).
2021 – సంజూ శాంసన్(119, రాజస్థాన్), దేవ్‌దత్ పడిక్కల్(101 నాటౌట్, ఆర్సీబీ), జోస్ బట్లర్(124, రాజస్థాన్), రుతురాజ్ గైక్వాడ్(101 నాటౌట్, చెన్నై).
2022- జోస్ బట్లర్(100, 103, 116, 106 నాటౌట్, రాజస్థాన్), కేఎల్ రాహుల్(103 నాటౌట్, 103 నాటౌట్, లక్నో), క్వింటన్ డికాక్(140 నాటౌట్, లక్నో), రజత్ పాటిదార్(112 నాటౌట్, ఆర్సీబీ).
2023- హ్యారీ బ్రూక్(100 నాటౌట్, హైదరాబాద్), వెంకటేశ్ అయ్యర్(104, కోల్‌కతా), యశస్వీ జైస్వాల్(124, రాజస్థాన్), సూర్యకుమార్ యాదవ్(103 నాటౌట్, ముంబై), ప్రభ్సిమ్రాన్ సింగ్(103, పంజాబ్), శుభ్‌మన్ గిల్(101, 104, 129 గుజరాత్), హెన్రిచ్ క్లాసెన్(104, హైదరాబాద్), కోహ్లీ(100, 101 ఆర్సీబీ), కామెరూన్ గ్రీన్(101, ముంబై).
2024 – విరాట్ కోహ్లీ(113 నాటౌట్, ఆర్సీబీ), జోస్ బట్లర్(100 నాటౌట్, 107 నాటౌట్, రాజస్థాన్), రోహిత్ శర్మ(105 నాటౌట్, ముంబై), సునీల్ నరైన్(109, కోల్‌కతా), ట్రావిస్ హెడ్(102, హైదరాబాద్), యశస్వీ జైస్వాల్(104 నాటౌట్, రాజస్థాన్), రుతురాజ్ గైక్వాడ్(108 నాటౌట్, చెన్నై), మార్కస్ స్టోయినిస్(124 నాటౌట్, లక్నో), జానీ బెయిర్‌స్టో(108 నాటౌట్, పంజాబ్), విల్ జాక్స్(100 నాటౌట్, ఆర్సీబీ), సూర్యకుమర్ యాదవ్(102 నాటౌట్, ముంబై), శుభ్‌మన్ గిల్(104, గుజరాత్), సాయి సుదర్వన్(103, గుజరాత్).
Raise your hand if you are still not over this partnership… 👋#AavaDe | #GTKarshe | #GTvCSK | #TATAIPL2024 pic.twitter.com/Acurqj91WK
— Gujarat Titans (@gujarat_titans) May 11, 2024