ఢిల్లీ: భారత యువ కరాటే క్రీడాకారిణి అలీషా చౌదరి సరికొత్త చరిత్ర సృష్టించింది. జార్జియాలో జరిగిన డబ్ల్యూకేఎఫ్ కరాటే 1సిరీస్ మహిళల కుమిటె 55 కిలోల విభాగంలో ఆమె కాంస్యం గెలిచింది. తద్వారా కరాటే 1సిరీస్‌లో మెడల్ గెలిచిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కింది.
నిరుడు ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో సత్తాచాటిన ఆమె.. కఠిన పోటీ ఉన్న డబ్ల్యూకేఎఫ్ ఈవెంట్లోనూ గెలిచి తన ప్రతిభను చాటుకుంది.