రవితేజ ట్రెండ్‌ని బాగా ఫాలో అవుతారు. దాదాపు పాతికేళ్లుగా స్టార్‌స్టేటస్‌ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారంటే కారణం అదే. రీసెంట్గా ‘మ్యాడ్’ దర్శకుడు కల్యాణ్ శంకర్ చెప్పిన కథను రవితేజ ఓకే చేశారట. ఈ కథ ‘మ్యాడ్’ని మించి ఉంటుందని సమాచారం. దర్శకుడు కల్యాణ్ శంకర్ ‘మ్యాడ్’ సినిమాతో చేసిన సందడి అంతాఇంతా కాదు. ఆయన ‘మ్యాడ్ స్కేర్’ త్వరలో విడుదల కానుంది. ఆ హడావిడి ముగిశాక రవితేజ సినిమా వర్క్ మొదలవుతుందట. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై భాను భోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ‘మ్యాడ్ స్కేర్’ని కూడా సితార ఎంటైర్టెన్మెంట్సే నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రవితేజ, కల్యాణ్‌శంకర్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాను కూడా సితార సంస్థే నిర్మించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.