Telangana Food Commission | నర్సాపూర్, నవంబర్ 4 : ఖచ్చితమైన బరువు ఆధారంగా రేషన్ దుకాణాలకు బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. MLS పాయింట్ వద్ద రేషన్ డీలర్లకు న్యాయం జరిగేలా చూసుకోవడానికి రేషన్ బియ్యాన్ని బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా ఖచ్చితమైన బరువు ఆధారంగా పంపిణీ చేయాలని గోలి శ్రీనివాసరెడ్డి నిర్దేశించారు.
ప్రతీ పేదోడి కడుపు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తుందని దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సరఫరా చేసే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని వివరించారు. అనంతరం బియ్యం నాణ్యత, బియ్యం సరఫరా, రేషన్ కార్డుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ రేషన్ షాప్లో వస్తువుల నిల్వ, పంపిణీ నమోదు పద్దతులు, కార్డుదారులకు సరైన విధంగా సరుకులు అందిస్తున్నారా అన్న అంశాలను పరిశీలించారు.
MLS పాయింట్లలో రేషన్ బియ్యం, డీలర్లు ప్రవర్తన, లబ్ధిదారులకు పంపిణీ చట్టబద్ధత అంశాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా నడిపించాలి.. లబ్ధిదారులకు పూర్తిగా వర్తింపజేయాలన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం క్రమంగా, నాణ్యతతో అందించాలి. జిల్లా అధికారులతోపాటు సంబంధిత శాఖల సమన్వయం ఉండేలా సూచనలు ఇచ్చారు. ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యుల వెంట డీఈఓ రాధాకిషన్, బీడబ్ల్యూఓ హేమ భార్గవి, సివిల్ సప్లై అధికారి నిత్యానంద, నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి, డీఆర్డీఏపీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


Rain Alert | ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Pardipuram | పర్దిపురంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన : వీడియో