ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి ఒకవైపు.. ఎలుకలు మరోవైపు..
ఎలుకల సమస్య ఎక్కువ కావడంతో వాటిని మహమ్మారి సరసన చేర్చుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటన చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలుకలు సృష్టిస్తున్న తలనొప్పులు భరించలేకపోతున్నారు

మెల్బోర్న్ : ఎలుకల సమస్య ఎక్కువ కావడంతో వాటిని మహమ్మారి సరసన చేర్చుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటన చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలుకలు సృష్టిస్తున్న తలనొప్పులు భరించలేకపోతున్నారు. నిద్రిస్తున్న ప్రజలను కొరకడమే కాకుండా పంటలను కూడా నాశనం చేస్తుండటంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇండ్లలో కరెంట్ వైర్లు కొరికేస్తుండటంతో మంటలు చెలరేగుతున్నాయంట. ఎలుకల్ని చంపేందుకు 5 వేల లీటర్ల బ్రోమోడియోలోన్ విషాన్ని పంపాలని భారత్‌కు విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తున్నది.
న్యూ సౌత్ వేల్స్లో ఎలుకల సంఖ్య వేగంగా పెరగడం వల్ల ‘మౌస్ ప్లేగు’ ప్రకటించారు. పొలాలు, ఇళ్ళు, పైకప్పులు, పాఠశాలలు, దవాఖానల్లోకి ఎలుకలు ప్రవేశిస్తున్నాయని వ్యవసాయ మంత్రి ఆడమ్ మార్షల్ తెలిపారు. ఎలుకలను తగ్గించనిపక్షంలో రానున్న రోజుల్లో న్యూసౌత్ వేల్స్ ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎలుకల వల్ల జబ్బు పడటమే కాకుండా పంటలను నష్టపోతున్నట్లు చాలా మంది రైతులు కలత చెందుతున్నారు. ఎలుకలను పట్టేందుకు ప్రత్యేక వ్యక్తులను నియమించుకుంటున్నారు. పంటలు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎలుకలను చంపేందుకు విషాన్ని త్వరగా విదేశాల నుంచి తెప్పించి ఆదుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎల్ఓసీపై 3 నెలలుగా ఒక్క బుల్లెట్ పేలలేదు : జనరల్ ఎంఎం నరవణె
వానాకాలం కరోనా వైరస్‌తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
ఎల్లుండి నుంచి ఎంపీలో అన్‌లాక్ : మార్గదర్శకాలు వెల్లడి
ఆరేండ్ల క్రితం కేసులో హైకోర్టు తీర్పు.. ధర్మసంకటంలో పినరాయి ప్రభుత్వం
తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
చైనాలో కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్
లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

