Hritik Roshan | బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం క్రిష్ 4. ఈ సినిమాతోనే హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హీరో చిత్రం క్రిష్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలు మాత్రమే తెలిసిన ప్రేక్షకులకు ఇండియన్ సూపర్ హీరోగా హృతిక్ రోషన్ అలరించాడు. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలు రాగా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీ నుంచి క్రిష్ 4 రాబోతుంది. మొదటి మూడు పార్టులకు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా.. తాజాగా వచ్చే క్రిష్ 4కి హృతిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికకు సంబంధించి ఒక క్రేజీ వార్త బీ టౌన్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్నా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.
కొన్ని బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, క్రిష్ 4 టీమ్ రష్మికను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించిందని ఆమె కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో ‘క్రిష్’ ఫ్రాంచైజీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించారు. అయితే ఈసారి మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రష్మిక పేరు వినిపిస్తుంది.