అమరావతి : భూ మండలంపై వింత వింత జీవరాశులు లక్షలాధి సంఖ్యలో ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. అంతేస్థాయిలో సముద్రంలోనూ వివిధ రకాల జీవరాశులు అప్పుడప్పుడూ దర్శనమిస్తూ సంబ్రమాశ్చార్యాలు కలిగిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లోని సముద్రతీరంలో ఇప్పటి వరకు కనిపించని చేపలు, ఇతర జీవరాశులు జాలర్లకు చిక్కడం అరుదుగా సంబవిస్తుంది.
అయితే తాజాగా విశాఖ పట్నంలోని రుషికొండ సమీప ప్రాంతంలో జాలర్ల వలకు వింత అకారంలో ఉన్న చేప చిక్కింది. తల భాగంలో ముళ్లు కలిగిఉండడంతో దానిని ముళ్ల కప్ప అంటారని మత్స్యకారులు తెలిపారు. సముద్రంలో చిన్న, చిన్న కీటకాలు, చేపలు, నాచు తింటూ జీవనం సాగిస్తాయని విశాఖ మత్స్య శాఖ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీనిని పఫర్ ఫిష్ అని కూడా అంటారని ఆయన వివరించారు. ప్రమాద సమయాల్లో రక్షణ కోసం తల భాగంలోని ముళ్లతో ప్రతిఘటిస్తాయని వెల్లడించారు.