హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేశారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేపిస్టులను రిలీజ్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు. తన ట్విట్టర్లో ఇవాళ ఆయన స్పందిస్తూ.. పంద్రాగస్టు రోజున జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ మహిళల గురించి చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేశ మహిళలను గౌరవించాలని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజరాత్ లో రిలీజైన 11 మంది రేపిస్టుల అంశంలో జోక్యం చేసుకోవాలని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు. రేపిస్టులను రిలీజ్ చేయరాదు అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఉన్నా.. గుజరాత్ ప్రభుత్వం రేపిస్టులను రిలీజ్ చేసిన ఘటన వికారంగా ఉందన్నారు. దేశ ప్రజల పట్ల సరైన రీతిలో వ్యవహరించాలని ప్రధాని మోదీని కోరారు.
రేపిస్టులకు కఠిన శిక్షను అమలు చేయాలని, ఆ దిశగా ఐపీసీ చట్టాలను సవరించాలని, రేపిస్టులకు బెయిల్ ఇవ్వకుండా చట్ట సవరణలు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కోరారు. బలమైన చట్టాలు ఉంటేనే న్యాయవ్యవస్థ త్వరితగతిని తీర్పులను ఇవ్వగలదని, అత్యుత్తమంగా న్యాయవ్యవస్థ రాణించగలదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అయిదు నెలల ప్రెగ్నెంట్ మహిళను దాహోద్ జిల్లాలో అత్యాచారం చేశారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడు మందిని హతమార్చారు. ఆ ఘటనలో 11 మందికి 14 ఏళ్ల జైలుశిక్ష పడింది. అయితే 75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆ రేపిస్టులను రిలీజ్ చేయడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
Dear PM @narendramodi Ji,
If you had really meant what you spoke about Respecting women, urge you to intervene & rescind the Gujarat Govt remission order releasing 11 Rapists 🙏
Sir, it is nauseating to put it mildly & against MHA order. Need you to show sagacity to the Nation
— KTR (@KTRTRS) August 17, 2022
Sir, I also urge you to make necessary amendments to the Indian Penal Code (IPC) & The Code of Criminal Procedure (CRPC) suitably so that no Rapist can get a bail through judiciary
Strong legislations are the only way to ensure Judiciary can deliver swiftly & perform at its best
— KTR (@KTRTRS) August 17, 2022