చింతల మానేపల్లి : ఆసిఫాబాద్ జిల్లా ( Asifabad District ) చింత మానేపల్లి మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు( Incessant rains ) వాగులు, ఒర్రెల్లో వరద నీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మండలంలోని దింద గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో దిందా- కేతిని వాగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బాబాసాగర్-నాయకపు వాడల్ మధ్యనున్న వాగులో అధికంగా నీటి వరద చేరడంతో నాయకపు వాడకు , బాలాజీ అనుకోడ- రవీంద్రనగర్ ప్రధాన రహదారిపై గల నున్న ఈదుల ఓర్రె పైకి నీళ్లు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి .