
ఆర్కేపురం, డిసెంబర్ 29 : రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యోగుల సర్వసభ్య సమావేశం బుధవారం ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యోగుల సంఘాన్ని రాష్ట్ర జేఏసీలో విలీనం చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వి.రాంమ్మోహన్రావు, ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా చింతపంటి శ్రీనివవాసరావు, జిల్లా జేఏసీ కన్వీనర్ సంతోష్కుమార్చార్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, కన్వీనర్ పి.రవీంద్రచార్యులు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, ప్రధాన కార్యదర్శి బద్రినాథు చార్యు లు, జిల్లా సభ్యులు జా.శ్రీకాంత్‌గౌడ్, పి.మదన్, శ్రీనివాస్‌గౌడ్, గంగు సత్యమూర్తి, మఠంశంకర్ కాశి, డి.లక్ష్మణాచారి, వరదరాజులు, సురేందర్, మహిపాల్, వామన్‌రావు, పవన్‌కుమార్, జగపతి పాల్గొన్నారు.