కొందుర్గు, మార్చి 13 : యువత క్రీడల్లోనూ రాణించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. ఆదివారం మండలంలోని శ్రీరంగాపూర్ వద్ద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఎంతో మంది నేడు జాతీయ స్థాయిలో ఉన్నారని అన్నారు. క్రీడల వల్ల దూర ప్రాంతాల వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుందని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు.
రైతు బీమా ప్రొసీడింగ్ అందజేత
కొందుర్గు గ్రామానికి చెందిన నిజాముద్దీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. రైతు బీమా ద్వారా అతని కు టుంబ సభ్యులకు రూ.5 లక్షల ప్రొసీడింగ్‌ను ఎమ్మెల్యే అందజేశారు. కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే
కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కొత్త బావయ్యకు చెందిన గడ్డి వామును గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మొత్తం గడ్డి దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బావయ్య కుటుంబ సభ్యులకు రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. గడ్డి వామును దగ్ధం చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సాధిక్, దర్గా రాంచంద్రయ్య, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.