పరిగి, మార్చి 9 ః సీఎం కేసీఆర్ వనపర్తిలో చెప్పినట్లుగానే బుధవారం నిరుద్యోగులకు తీపికబురు అందిస్తూ కొలువుల జాతరను అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తో కొనసాగిన తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ స్వరాష్ట్రంలో మళ్లీ కొలువుల బొనాంజాను ప్రకటించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే బుధవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో కొలువుల నియామకానికి సంబంధించి ప్రకటించారు. గతంలో వలె కాకుండా ప్రతి జిల్లాకు జిల్లా కేడర్ పోస్టులు, జోనల్, మల్టీ జోనల్, గ్రూపు పోగుండెల్లో కొలువై…
రంగారెడ్డి జిల్లావాసుల్లో ఉప్పొంగిన ఉత్సాహం
రంగారెడ్డి, మార్చి 9, (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తో రాష్ర్టాన్ని సాధించడంతో పాటు రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో భారీగా నిధులిచ్చి కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేసింది. ఇప్పటికే మిషన్ భగీరథ కార్యక్రమంతో ఇంటింటికీ నల్లాలు వేసి తాగునీటినందిస్తున్నది. జిల్లాలో సాగునీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే కొత్త జిల్లాలు, కొత్త జోనల్ విధానంతో పెండింగ్‌లో ఉన్న నియామకాల ప్రక్రియనూ చేపట్టేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నూతన జోనల్ విధానం ప్రకారం కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ఇటీవల పూర్తి కావడంతో ఉద్యోగ ఖాళీల సంఖ్య లెక్కతేలింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్ణయించి, తక్షణమే నోటిఫికేషన్ జారీ చేసేలా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రకటనతో జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు.
95 శాతం స్థానికులకే..
గ్రూప్-2, 3, 4 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ఇప్పటికే ప్రత్యక్ష నియామక పద్ధతిలో చేపట్టాల్సిన ఖాళీల భర్తీ పూర్తి చేయగా, ప్రస్తుతం మిగతా పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలతోపాటు అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియనూ పూర్తి చేసిన దృష్ట్యా ఖాళీలకు సంబంధించి పూర్తి స్పష్టత రావడంతో పోస్టుల భర్తీని చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశించింది. 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలు 1561 ఖాళీలు ఉన్నాయి. గతంలో స్థానికేతరులకు ప్రాధాన్యమిస్తూ స్థానికులకు గత పాలకులు అన్యాయం చేశారు. దీంతో ఇలాంటివి పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ కొత్త జోనల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త జోనల్ విధానంతో ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టుల్లో 95 శాతం స్థానికులకే రానున్నాయి. మిగతా 5 శాతంలో స్థానికులతోపాటు స్థానికేతరులు పోటీ పడవచ్చు. అంతేకాకుండా ఇకపై ప్రతీ ఏటా ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి క్యాలెండర్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్…
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని 1064 మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యులరైజ్ కానున్నాయి. ఇప్పటికే 30 శాతం మేర పీఆర్సీని అమలు చేసి వేతనాలనూ ప్రభుత్వం పెంచింది. 2014 జూన్ 2కు ముందున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నది.
వయోపరిమితి పెంపు..
నూతన జోనల్ విధానం ఏర్పాటు, కొత్త జోనల్ ప్రకారం జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియతో ఉద్యోగ ఖాళీల లెక్కతేల్చారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతో వయోపరిమితిని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. పోలీస్ శాఖను మినహాయించి గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచుతూ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, ఓసీలకు 44 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల వరకు వయోపరిమితిని పెంచారు. వయోపరిమితిని పెంచడంపై నిరుద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్టుల వారీగా నియామకాలు చేపట్టనుం
డడంతో ఆయా జిల్లాల వారీగా ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులకు మరింత సులువవుతున్నది. గత డిసెంబర్లో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీవో ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 80,039 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటించారు. ఇందులో జిల్లా కేడర్ పోస్టులు 39,829, జోనల్ పోస్టులు 18,866, మల్టీ జోనల్ 13,170 పోస్టులు, సచివాలయం, హెచ్వోడీలు, విశ్వ విద్యాలయాల్లో 8,147 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేడర్‌లో 738 ఉద్యోగాల నియామకం చేపట్టడం జరుగుతుంది.
95 శాతం జిల్లా వాసులకే ఉద్యోగావకాశాలు..
ప్రభుత్వం కొత్తగా ఉద్యోగ నియామకాలకు నిర్ణయించడంతో జిల్లా పరిధిలోని జిల్లా కేడర్ పోస్టులన్నీ 95శాతం జిల్లావాసులకే దక్కనున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. అప్పట్లో నాన్‌లోకల్ పేరిట 20శాతం ఇతర జిల్లాల వారికి ఉద్యోగాలు దక్కేవి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సర్కారు తీసుకున్న చర్యలతో ప్రస్తుతం ప్రకటించిన ఉద్యోగాల్లో జిల్లా కేడర్వి పూర్తిగా జిల్లా వాసులకే దక్కనున్నాయి. తద్వారా జిల్లా పరిధిలోని నిరుద్యోగులకు మేలు చేకూరనున్నదని చెప్పవచ్చు. మారుమూల గ్రామాలు, తండాల వారు సైతం జిల్లా కేడర్ పోస్టులను దక్కించుకునేందుకు అవకాశం కలిగింది. ఇవేకాకుండా జోనల్, మల్టీ జోనల్ పోస్టులు, గ్రూపులకు సంబంధించిన పోస్టులు సైతం దక్కించుకోవచ్చు.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్..
ప్రభుత్వం గతంలో పేర్కొన్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలోనే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు వెళ్లాయి. కోర్టులో సైతం ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలమైన తీర్పు రావడంతో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నారు.
వయో పరిమితి పెంపు …
తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్‌లోని నియామకాలకు సంబంధించి వయో పరిమితిని ప్రభుత్వం పెంచడం వల్ల అన్ని వర్గాల వారికీ అవకాశం కలిగింది. పోలీసు శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని పదేండ్లు పెంచాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఓసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ఠ వయో పరిమితి పెరిగింది.
ఉదయం 10 గంటలకు టీవీల ముందు..
నిరుద్యోగులకు రేపు ఉదయం 10 గంటలకు తీపికబురు అందిస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ వనపర్తిలో ప్రకటించడంతో నిరుద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల వారు టీవీలకు అతుక్కుపోయారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటన చేస్తారని ఊహించినా, ఎన్ని ఉద్యోగాల నియామకాలు చేపడుతారో తెలుసుకునేందుకు ఆతృతగా ఎదురుచూశారు. తెలంగాణ ఉద్యమం తర్వాత టీవీలకు హత్తుకుపోయి చూసిన సందర్భం ఇదేనని చెప్పవచ్చు.
ఆనందానికి అవధుల్లేవ్..
సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయగానే నా పట్టరాని ఆనందం కలిగింది. నాలా ఎదురు చూస్తున్న ఎంతో మందికి బతుకుపై భరోసా ఏర్పడింది. ఏ జోన్ వారికి ఆ జోన్లోనే ఉద్యోగాలు ఇవ్వడం చాలా బాగుంది.
– మునీర్, వికారాబాద్
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగులమంతా రుణపడి ఉంటాం. తెలంగాణ వచ్చాకే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఉద్యోగాల ప్రకటన చాలా సంతోషకం కలిగించింది.
– మోత్యానాయక్ బీఈడీ, నంద్యాతండా, జిల్లెడు చౌదరిగూడ
కల నెరవేరే సమయం..
కొన్ని ఏండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. వయో పరిమితిని పెంచడం చాలా సంతోషంగా ఉన్నది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడం చాలా సంతోషం.
– ఏ రమేశ్, హస్నాబాద్, కొడంగల్
నిరుద్యోగులకు సువర్ణ అవకాశం..
ఇది నిరుద్యోగులకు మంచి సువర్ణ అవకాశం. మన ఉద్యోగాలు మనకే దక్కాలనే దూరదృష్టితో సీఎం కేసీఆర్ సార్ జోన్ల సిస్టం తీసుకొచ్చారు. సీఎం ప్రకటన ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపింది.
– తోట గిరియాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆమనగల్లు
మా కుటుంబంలో ఆనందం..
సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయడంతో మా కుటుంబంలో ఆనందం నిండింది. నేను, నా భార్య ఉన్నత చదువులు పూర్తి చేశాం. ఎంతో మంది నిరుద్యోగులకు మేలు కలుగనున్నది.
– ఆంజనేయులు, హైతాబాద్(షాబాద్)
నోటిఫికేషన్ ఇవ్వడం హర్షణీయం..
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం హర్షణీయం. పీజీ వరకు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా. నిరుద్యోగుల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
– పి.శరత్, విద్యార్థి షాబాద్
నిరుద్యోగులకు తీపి కబురు..
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుండడంతో ఎంతో మందికి మేలు జరుగనున్నది. ఉద్యోగం సాధించేలా కష్టపడి చదువుతా.
– పద్మ, మొయినాబాద్
సీఎం నిర్ణయం బాగున్నది..
నిరుద్యోగుల కష్టాలు తీర్చేలా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా బాగున్నది. మా ఇద్దరు పిల్లలను పై చదువులు చదివించా. సర్కారు నౌకర్లకు నోటిఫికేషన్ ఇవ్వనుండడం చాలా సంతోషంగా ఉన్నది.
– మల్లేశ్‌యాదవ్, విద్యార్థి తండ్రి, షాబాద్
ఉద్యోగాల భర్తీ చేపట్టడం సంతోషకరం..
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడం సంతోషకరం. ఉద్యోగాల ప్రకటన చేయడం గొప్ప నిర్ణయం. కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని చెప్పడంతో ఎంతోమందికి మేలు జరుగుతుంది.
– కరుణాకర్, ఎంపీటీసీ కక్కులూర్(షాబాద్)
ఉద్యోగ ప్రకటన సంతోషంగా ఉన్నది..
సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయడం సంతోషంగా ఉన్నది. బాగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతా. ఉద్యోగ ప్రకటన చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– సబిత, దుద్దాగు గ్రామం, చేవెళ్ల మండలం
నిరుద్యోగుల పాలిట దేవుడు కేసీఆర్..
ఉద్యోగాల ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పాలిట దేవుడయ్యారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు పూర్తి కానున్నాయి.
– దీమ గణేశ్ బీకం, కాస్లాబాద్ గ్రామం, జిల్లెడు చౌదరిగూడ
చాలా ఆనందంగా ఉన్నది..
ఉద్యోగాల భర్తీ ప్రకటన చాలా ఆనందాన్ని కలిగించింది. దీనికి తోడు వయో పరిమితిని పెంచడం సంతోషకరం. నోటిఫికేషన్‌పై స్పష్టత ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– పలుమారి హరీశ్‌కుమార్, గ్రామం. కోట్‌పల్లి
ఉపాధ్యాయ కోర్సు పూర్తి చేశా..
ఉపాధ్యాయురాలుగా నేను కోర్సు పూర్తి చేశా. ఉద్యోగాల భర్తీ అన్న తీపి కబురుతో నాలో సంతోషం నిండింది. నిరుద్యోగుల కల నెరవేరే సమయం వచ్చింది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– పద్మశాలి కృష్ణవేణి, కోట్‌పల్లి గ్రామం
తెలంగాణ ట్యాగ్‌లైన్‌ను నిలబెట్టాడు..
ఉద్యోగాల జాతరకు తెరలేపి సీఎం కేసీఆర్‌సార్ తెలంగాణ ట్యాగ్‌లైన్ నిలబెట్టిండు. నీళ్లు, నిధులు, నియామకాలను ఇచ్చిన రాష్ట్ర సర్కారుకు ధన్యవాదాలు. అసెంబ్లీలో చేస్తుంటే మస్తు సంబురమైంది.
– పరమేశ్, తెలంగాణ ఉద్యమకారుడు. ఎంఏ, బీఈడీ
మన ఉద్యోగాలు మనకే..
మన ఉద్యోగాలు మనకే దక్కేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎంతో మందికి ఉద్యోగాలు రాబోతున్నందుకు ఆనందంగా ఉన్నది. ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– శంకర్‌గౌడ్ పీజీ, తంగెళ్లపల్లి, కొందుర్గు మండలం
నిరుద్యోగులకు పెద్ద వరం..
ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడం నిరుద్యోగులకు పెద్ద వరం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మాటను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఉద్యోగాలకు వయో పరిమితి పెంచడం సంతోషకరం.
– మాసుల శశివర్ధన్, దుద్యాల, బొంరాస్‌పేట మండలం
నోటిఫికేషన్‌తో హర్షణీయం..
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనకై అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనుండడం హర్షణీయం. ఎంతో మందికి మేలు చేకూర్చనున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఆరే శ్రీకాంత్ ఎన్కతల
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎంతో మంది భవిష్యత్తుకు బంగారు బాటలు పడనున్నాయి.
– గోల్ల రమేశ్, టేకులపల్లి, నిరుద్యోగి
ఫలించిన నిరుద్యోగుల కల
తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు చేస్తామనే హామీతో తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగుల కల నెరవేరనున్నది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– దత్తాత్త్రేయ
నిరుద్యోగులకు పండుగే..
పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం నిరుద్యోగులకు పండుగే. డీఎస్సీ, టీటీసీ పూర్తి చేసిన వారికీ ఉద్యోగావకాశాలు కల్పించడం హర్షణీయం. జాబ్ క్యాలెండర్‌నూ విడుదల చేస్తామనడం గొప్ప నిర్ణయం.
– పి.గోపాల్, కోటబాసుపల్లి, తాండూరు
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇంత సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేదు.
– బోళ్ల రవి, తలకొండపల్లి
కొలువుల జాతర
అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు కొలువుల జాతరను ప్రకటించడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైంది. వయో పరిమితి పెంచడం సంతోషకరం. స్థానికులకే ఉద్యోగాలు దక్కుతున్నందుకు సంతోషంగా ఉన్నది.
– సుష్మిత, తాండూరు
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
ఉద్యోగాల ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎంఏ, బీఈడీ పూర్తి చేశాను. నిరుద్యోగుల్లో నూతనోత్సాహం వచ్చింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.
– కాట్న మురళీదర్, అంగడి చిట్టంపల్లి, పూడూరు మండలం
మాట నిలబెట్టుకొన్న సీఎం కేసీఆర్..
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్నది. ఉద్యోగాల ప్రకటన చేయడం చాలా సంతోషకరం.
– తలారి గోపాల్, ఎంఏ(టీపీటీ), పెద్దేముల్
ప్రతిపక్షాలకు చెంపపెట్టు..
సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యోగాల ప్రకటన చేయడం ప్రతిపక్షాలకు చెంపపెట్టు. అనవసరమైన ఆరోపణలు చేయకుండా వాళ్ల నోళ్లకు తాళం పడింది. నిరుద్యోగులంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు.
– బి.నర్సింలు, బీఏ (హెచ్ఈపీ), రుద్రారం, పెద్దేముల్