వికారాబాద్, మార్చి 9 : ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు డప్పు చప్పుళ్లతో, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్‌బేగం, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, గాయత్రి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు గయాజ్, మండల ఉపాధ్యక్షుడు గఫార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగాల భర్తీపై హర్షం
ధారూరు, మార్చి 9 : ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ధారూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ధారూరులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, సంబురాల్లో మునిగిపోయారు. కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు శశాంక్, గ్రామ యూత్ అధ్యక్షుడు మహేశ్, మైనార్టీ నాయకులు సద్దాం, శేఖర్, నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల్లో ఉత్సాహం
తాండూరు రూరల్, మార్చి 9 : నిరుద్యోగుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన ఉత్సాహాన్ని నింపిందని టీఆర్ఎస్ జిల్లా మహిళా విభాగం నాయకురాలు శకుంతల, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి అన్నారు. గౌతాపూర్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారని తెలిపారు. వచ్చే మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ అధికారంలోకి ఉంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలకు కార్యరూపం
యాలాల మార్చి 9 : సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలకు నేడు కార్యరూపం ఇవ్వడంతో 90 వేలకు పైచిలుకు ఉద్యోగాలకు త్వరలో భర్తీ కానుండడం నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అని ఎంపీపీ బాలేశ్వరగుప్తా అన్నారు. లక్ష్మీనారాయనపూర్ చౌరస్తాలో తన ఆనందాన్ని మండల నాయకులతో పంచుకొన్నారు. స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చారు.
ఉద్యోగాల నియామకం కేసీఆర్‌కే సాధ్యం..
మోమిన్‌పేట, మార్చి 9 : రాష్ట్రంలో ఉద్యోగాల నియామకం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమని పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ అన్నారు. మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, కార్యకర్తలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తాండూరు రూరల్, మార్చి 9 : సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పట్ల దేవుడిగా నిలిచారని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు జిలానీ, అధికారి ప్రతినిధి దత్తాత్రేయ పేర్కొన్నారు. తాండూరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగ జాతర
– గోపాల్, నాగారం, ధారూరు
ముఖ్యమంత్రి బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేయడంతో ఉద్యోగ జాతర మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రాడంతో సంతోషంగా ఉంది. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు ఇవ్వనున్నడంతో ఆనందంగా ఉంది. అవసరమున్న ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగులకు చక్కటి అవకాశం దొరికింది.
ఉద్యోగాల భర్తీపై హర్షం
– రాజశేఖర్‌గౌడ్, పుట్టపహాడ్ కులకచర్ల మండలం
ప్రభుత్వం నియామకాలు చేపడుతామని ఉద్యోగ ప్రకటన అసెంబ్లీలో చేయడం హర్షణీయం. దీంతో నచ్చిన ఉద్యోగాలు ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. మాలాంటి చాలామంది చదువుకున్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది
ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం
– టి.రాజేందర్, పూడూరు గ్రామం
ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఉద్యోగాల కోసం వేచిఉన్న కొందరికి 10 సంవత్సరాలు అదనంగా వయస్సు పొడిగించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటిస్తుందని ప్రకటించడం సంతోషంగా ఉంది.
యువతకు సువర్ణావకాశం
– శాంతికుమార్, టీఆర్ఎస్ నవాబుపేట మండల యూత్ అధ్యక్షుడు
యువతకు అవకాశాలు కల్పించే చిత్తశుద్ధి కేవలం టీఆర్ఎస్కే ఉంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కోర్టుకు వెళ్లడంతోనే ఉద్యోగాల భర్తీ ఆలస్యమైంది. ఇంతపెద్ద యువతను తప్పుదోవపట్టించడం మానుకోవాలి. 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణం నోటిఫికేషన్ జారీ చేయడం యువతకు శుభపరిణామం. వయోపరిమితిని పెంచి అందరి మనస్సును దోచుకున్నారు.