పరిగి, మార్చి 26: మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో కల్పించనున్న మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలను మొబైల్ యాప్‌లో పొందుపర్చాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు. శనివారం మద్గుల్చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో ‘మన ఊరు-మన బడి’ వెబ్‌సైట్‌పై సం బంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’ క్రింద చేపట్టనున్న పనులకు సంబంధించి ప్ర త్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు.. అందులో వివిధ పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానోపాధ్యాయుల ద్వారా అప్లోడ్ చేయించా లన్నారు.
ఎంపికైన బడుల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ఫొటోలను ప్రధానోపాధ్యాయుల ద్వారా యాప్‌లో అప్లోడ్ చేయించాలని, ఇంజినీరింగ్ అధికారులు సంబంధిత పనులను పరిశీలించి ఖర్చుకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించి యాప్ ద్వారా ఈఈ, డీఈల ద్వారా జిల్లా కలెక్టర్‌కు పంపించాలన్నారు. కలెక్టర్ ఆమోదంతో పనులను చేపట్టాలన్నారు. మరుగుదొ డ్లు, కిచెన్షెడ్లు, ప్రహరీల పనులను గ్రా మీణ ఉపాధిహామీ క్రింద చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పనులకు సంబంధించిన అంచనాలను ఆన్లైన్ ద్వారా పంపించి వారం రోజు ల్లో మంజూరు అనుమతులను పొంది వెంటనే పనులను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఈవో రేణుకాదేవి, మహమూద్‌అలీ, మండలాల విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ శాఖల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.