కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు భయం వీడి బడిబాట పట్టారు. కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం స్కూళ్లలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించింది. దీంతో చాలామంది తమ పిల్లలను ప్రత్యక్ష తరగతులకు పంపిస్తుండడంతో హాజరుశాతం అధికంగా నమోదవుతున్నది. ప్రారంభంలో జిల్లావ్యాప్తంగా కేవలం 30 శాతం ఉండగా.. ప్రస్తుతం 73 శాతానికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. దీపావళి అనంతరం వందశాతం హాజరయ్యే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ నెల 24 నుంచి ప్రభుత్వ వసతిగృహాలు ప్రారంభం కాగా ఇప్పటికే 50 శాతం విద్యార్థులు హాస్టళ్లకు చేరుకున్నారు. కాగా, జిల్లాలో 1318 ప్రభుత్వ పాఠశాలలుండగా 1,36,785 మంది విద్యార్థులు ఉన్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యార్థుల హాజ రు శాతం పెరిగింది. కొవిడ్ కేసుల దృష్ట్యా ప్రా రంభంలో విద్యార్థులను స్కూళ్లకు పంపేందు కు తల్లిదండ్రులు వెనుకడుగు వేశారు. అయితే జిల్లాలో కొవిడ్ కేసులు పూర్తిగా తగ్గడం, ఒక్కో రోజు ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడంతో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. స్కూళ్లు ప్రారంభమైన సమయంలో తక్కువ విద్యార్థులు హాజరుకాగా, నెల రోజుల్లోనే హాజరు శాతం అంచనాలకు మించి పెరిగినది. అయితే దీపావళి పండుగ అనంతరం సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు వంద శాతానికి పెరి గే అవకాశాలున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసించే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులను పూర్తిగా నిలిపివేసి ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్నా రు. అదేవిధంగా ఈనెల 24వ తేదీ నుంచి ప్రభు త్వ వసతి గృహాలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని వసతులు కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ వసతిగృహాలకు విద్యార్థులు చేరుకుంటున్నారు. మరోవారం రోజుల్లో మిగతా విద్యార్థులందరూ చేరుకునేలా విద్యాశాఖ అధికారులు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పంపించాలని సూచిస్తున్నారు.
జిల్లాలో 73.03 శాతానికి పెరిగిన హాజరు శాతం
రంగారెడ్డి జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతం 73.03 శాతానికి పెరిగింది. స్కూళ్లు ప్రారంభమైన సమయంలో కేవలం 30 శాతం మాత్రమే ఉండగా ప్రస్తుతం 73 శాతానికి పెరిగినది. జిల్లాలో 1,318 ప్రభు త్వ పాఠశాలలుండగా 1,36,785 మం ది విద్యార్థులున్నారు. అయితే గురువా రం నాడు జిల్లాలో హాజరైన విద్యార్థుల సంఖ్య 99,897 మందిగా ఉంది. అదేవిధంగా ఎయిడెడ్ స్కూళ్లు 14 ఉండగా మొత్తం 1,843 విద్యార్థులున్నారు. వీరి లో 1,023 మంది విద్యార్థులు హాజరవుతున్నా రు. జిల్లాలో 20 కేజీబీవీలతోపాటు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో 50 శాతం మేర విద్యార్థులు వసతిగృహాలకు చేరుకున్నారు. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించినట్లయితే 55 శాతం మేర ఉన్నది. అయితే ప్రైవేట్ స్కూళ్లలో కేవలం 7 నుంచి 10 తరగతులు మాత్రమే ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1,350 ప్రైవేట్ పాఠశాలలుండగా, ఇప్పటివరకు 1,328 స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం 4,73,629 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 2,08,413 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. దీపావళి అనంతరం 1 నుంచి 6వరకు కూడా తరగతులను ప్రారంభించేందుకు ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం..
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినది. ఓ వైపు బీసీ, మైనార్టీ, ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలకు ప్రాధాన్యమిస్తూనే ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత, జడ్పీ పాఠశాలల బలోపేతానికి కూడా చర్యలు తీసుకుంటున్నది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించడం కూడా సర్కారు బడుల్లో కొత్తగా విద్యార్థులు చేరుతున్నారని చొప్పొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు మధ్యాహ్న భోజనం, పుస్తకా లు, స్కూల్ డ్రెస్సులు కూడా ఉచితంగా అందిస్తుండటం, పదోతరగతి విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల దత్తత తదితర కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తుండటం కూడా ప్రభుత్వ పాఠశాలలకు కలిసొస్తున్నది. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సం ఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అధికంగా ఉన్నది. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్థుల్లో ప్రైవేట్ పాఠశాలలతోపాటు అంగన్వాడీలు, రెగ్యులర్ స్కూళ్లు, బడిబయటి పిల్లలున్నారు. జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 20, 639 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. వీరిలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి చేరిన విద్యార్థులకు సంబంధించి 7,155మంది ఉన్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుండడం, కొవిడ్ పరిస్థితుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకుండా ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు ఫీజులు వసూలు చేయడం వంటి కారణాలతో సర్కార్ బడుల్లో విద్యార్థులు చేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
వారం, పది రోజుల్లో వంద శాతం హాజరు
కొవిడ్ కేసులు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతున్నది. స్కూళ్ల ప్రారంభంతో పోలిస్తే విద్యార్థుల హాజరుశాతం అధికంగా పెరిగినది. మరోవారం, పది రోజుల్లో విద్యార్థుల హాజరు శాతం వంద శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఆ దిశగా విద్యార్థుల తల్లిదండ్రుల కు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ వసతిగృహాల్లోనూ వారం రోజు ల్లో విద్యార్థుల హాజరు శాతం వంద శాతానికి పెరుగుతుంది.