ఆటోమోటివ్ ఫోర్ వీలర్ మెకానిక్, హాస్పిటాలిటీ కోర్సుల్లో శిక్షణ
30 రోజుల వసతితో పాటు విద్యార్థినులకు ప్రత్యేక హాస్టల్
షాద్‌నగర్ సమీపంలో ప్రథమ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్
కొత్తూరు, ఆగస్టు 21: యువత ఏదైనా ఉద్యోగం సంపాదించాలంటే ముందుగా దానికి సంబంధించిన శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చుచేసి కోచింగ్ తీసుకుంటాం. అంతేకాకుండా మనం కోచింగ్ తీసుకునే సమయంలో హాస్టళ్లలో ఉండటం కూడా తప్పనిసరి. దానికోసం కూడా కొంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక కోచింగ్ తీసుకున్న తర్వాత ఉద్యోగ వేట కొనసాగించాలి. నైపుణ్యత కలిగిన ఉద్యోగం కావాలంటే ఈ ప్రాసెస్ తప్పని సరి. కానీ ఒకే చోట కోచింగ్, వసతి ఏర్పాటు, ఉద్యోగం ఇప్పించ కలిగితే ఎగిరి గంతేసి అందులో చేరిపోతాం. అది కూడా నయాపైసా ఖర్చు లేకుండా ప్లేస్మెంట్ వరకు వారే చూసుకుంటే ఇక ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అలాంటి అన్ని వసతులను కల్పిస్తున్నది ప్రథమ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్.
ప్రతి నెలా 60 మందికి శిక్షణ
కొత్తూరు- షాద్‌నగర్ పాత జాతీయ రహదారికి పక్కనే షాద్‌నగర్‌కు అతి సమీపంలో లింగారెడ్డి ఈ స్కిల్ డెవెలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ)తో కలిసి పనిచేస్తున్నది. కొటక్ కర్మ వారి ప్రథమ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ దేశంలోని అనేక ప్రాంతాల్లో స్కిల్ డెవలమ్మెంట్ ప్రోగ్రాంను నడిపిస్తున్నది. దాని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని నాగోల్, వరంగల్, మెదక్ జిల్లాలోని గుర్గంపాడ్, నిజామాబాద్, భద్రాచలంలో దీని శిక్షణా సంస్థలు ఉన్నాయి. జిల్లాలోని షాద్‌నగర్‌లో 2018లో ప్రారంభించారు. ఇందులో ఇప్పుడు రెండు కోర్సులకు శిక్షణ ఇస్తున్నారు. అవి ఆటోమోటివ్ ఫోర్ వీలర్ మెకానిక్, హాస్పిటాలిటీ (హోటల్ మేనేజ్మెంట్) ట్రైనింగ్. ఒక కోర్సులో ప్రతి నెలా 30 మందిక శిక్షణ ఇస్తుంది. రెండు కోర్సులకు కలిపి ప్రతి నెలా 60 మందికి శిక్షణ తీసుకుంటున్నారు.
శిక్షణ.. ఉద్యోగం
ప్రథమ్ స్కిల్ డెవెలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు 30 రోజుల పాటు ఉచిత హాస్టల్ వసతి కూడా ఉంటుంది. అమ్మాయిలకు కూడా శిక్షణ ఇస్తారు. యునిఫాం, షూస్ ఉచితంగా ఇస్తారు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఉంటుంది. కేవలం 20 శాతం థియరీ, 80 శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణ అనంతరం విద్యార్థులకు ప్రథమ్, కొటక్ బ్యాంక్ వారి ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఎన్ఎస్డీసీ వారి సౌజన్యంతో ఇస్తారు. ప్రాక్టికల్ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
వెయ్యి మందికి ప్లేస్మెంట్
ప్రథమ్ స్కిల్ డెవెలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిన 2018 నుంచి 2021 జూలై వరకు సుమారు 1000 ఉద్యోగావకాశాలు కల్పించారు. శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగంలో చేర్పించే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. అయితే ప్రారంభంలో జీతం కొంత తక్కువగా ఉంటుందని, నైపుణ్యం ఉంటే ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంటుందని సెంటర్ నిర్వాహకులు తెలిపారు.
శిక్షణ పొందడానికి అర్హతలు
1) కనీసం 8వ తరగతి పాసై ఉండాలి.
2) 18 నుంచి 30 ఏండ్ల వారు
ఎవరైనా ఈ శిక్షణ తీసుకోవచ్చు
2) ఆధార్/ఓటర్ కార్డు తప్పని సరి
3) బ్యాంక్ అకౌంట్, పదోతరగతి మెమో,
ఆరు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు
4) ప్రతి నెలా 1, 15 తేదీల్లో బ్యాచ్‌లు ప్రారంభం
5) 9000049345, 9502597889 నంబర్లకు ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
100 శాతం ప్లేస్మెంట్
మోటర్ మెకానిక్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో 30 రోజులు వసతితో కూడిన శిక్షణ ఇస్తాం. ఎక్కువగా ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఇస్తాం . ముఖ్యంగా విద్యార్థినులకు ప్రత్యేక వసతి కల్పిస్తాం. శిక్షణ అనంతరం వారి ఎదుర్కొనే కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతాం. శిక్షణ పొందిన వారందరికీ వంద శాతం ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేమే తీసుకుంటాం.
సెంటర్లో శిక్షణ బాగుంది
ప్రథమ్ స్కిల్ డెవెలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ బాగుం ది. ముఖ్యంగా ఇక్కడ ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా ఉండటానికి వసతికూడా ఏర్పాటు చేస్తున్నారు. నేను మోటర్ మెకానిక్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. నేను శిక్షణ తీసుకోబట్టి 20 రోజులైంది. ఉద్యోగం కూడా మేమే కల్పిస్తామని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు.
20 రోజుల్లోనే చాలా విషయాలు..
నేను ఇక్కడ 20 రోజుల నుంచి శిక్షణ తీసుకుంటున్నాను. కారు ఇంజిన్‌లో వివిధ భాగాలు తీసి ఎలా అమర్చాలి, ఇంకా ఇతర సమస్యలు వస్తే ఎలా రిపేర్ చేయాలో నేర్పుతున్నారు. 20 రోజుల్లోనే నేను మోటర్ మెకానిక్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 రోజుల్లో శిక్షణ పూర్తవుతుంది. ప్రముఖ కారు షోరూంలో ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు.