షాద్‌నగర్, అక్టోబర్ 31 : ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సేవలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కొనియాడారు. ఆదివారం సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలో పటేల్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. నేటి తరం పటేల్ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఉక్కు మనిషికి నివాళి
షాద్‌నగర్, అక్టోబర్ 31 : ఉక్కు మనిషి సర్ధార్ పటేల్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్ధార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినంగా నిర్వహించుకుంటారని తెలిపారు. తోటి ఉద్యోగులతో సత్యనిష్ఠి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ హోం మంత్రిగా ఎన్నో సేవలు చేశారన్నారు. దేశ విభజన అనంతరం శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, ఏవో ప్రమీళ, పాల్గొన్నారు.
కవాడిపల్లిలో సర్దార్ పటేల్ జయంతి
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 31 : మండలంలోని కవాడిపల్లి గ్రామ సర్దార్ వల్లబాయ్ పటేల్ యూత్ ఆధ్వర్యంలో పటేల్ జయంతిని నిర్వహించారు. యూత్ అధ్యక్షుడు బొడిగె నరేశ్‌గౌడ్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు జంగమయ్యగౌడ్, సురేశ్‌గౌడ్, లక్ష్మణాచారి, ఓరుగంటి గోపాల్, సత్యనారాయణ, సద్గునాచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు.