యాచారం, నవంబర్ 9: మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు బొప్పాయి తోటల సాగుపై దృష్టి సారించారు. మార్కెట్లో బొప్పాయి పండ్లకు మంచి గిరాకీ ఉండటంతో యాచారం, చౌదర్పల్లి, తులేఖుర్ధు తదితర గ్రామాల్లోని రైతులు బొప్పాయి తోటలను సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతం పండ్ల తోటలకు అనువైనది కావ డం, పైగా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందొచ్చని రైతులు కూరగాయల సాగుతోపా టు బొప్పాయి తోటల సాగుపై దృష్టి సారించా రు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తున్నారు. చౌదర్పల్లి గ్రామం లో డ్రిప్ పద్ధతిలో బొప్పాయి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో తక్కువ ఖర్చు తో ఎక్కువ దిగుబడి సాధించొచ్చని వారు పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో తైవాన్రెడ్లేన్ విత్తనాలను కొనుగోలు చేసి నాటుతు న్నారు. ఈ విత్తనాలను నాటి మొలకలు వచ్చే వరకు రైతులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. బొప్పాయి పంట దిగుబడి ఆరు నెలల నుంచే ప్రారంభమవుతుందని పేర్కొంటున్నారు.
సస్య రక్షణ చర్యలు..
మండలంలోని పలు గ్రామాల్లో తైవాన్ హైబ్రీడ్ రకం బొప్పాయి తోటలను సాగుచేస్తున్నారు. బొప్పాయి సాగులో రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భూమిని 30 నుంచి 40 మీటర్ల లోతు వరకు దున్నాలి. మొక్కల మ ధ్యన 1.8 మీటర్ల దూరం ఉండేలా గుంతలు తీ యాలి. మొక్క నాటే 15 రోజుల ముందు 5 కిలోల పశువుల ఎరువు, కిలో వేప పిండి, ఇరవై గ్రాముల అజోస్పీరిల్లం వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. తేలిక పాటి నేలలైతే బొప్పాయిలో జింక్, బొరాన్ ధాతువు లోపం ఎక్కువ కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటిలో ఒక గ్రా ము బోరాక్స్, రెండు గ్రా ముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్క చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసు కోవాలి. నీరు నిలిస్తే పంటకు నష్టం జరుగుతుం ది. నవంబర్ నెలలో ఆకులపై గోధుమ రంగు ఏర్పడి ఆకులు పసుపు రంగుగా మారి రాలిపోతాయి. దాని నివారణకు లీటరు నీటిలో మాం కోజెబ్ 2.5 గ్రాములు పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పంటపై పిచికారీ చేయాలి. బొప్పాయి తోటలపై పదిహేను రోజులకోసారి మందులను పిచికారీ చేయాల్సి ఉంటుంది. చెట్లు పూతకు వచ్చే వరకు క్రిమికీటకాల నుంచి కాపాడుకోవాలి. పంట కాపునకు వచ్చిన తరువాత తోటకు పిండినల్లి రాకుండా మందులను పిచికారీ చేసుకోవాలి.
బొప్పాయి తోటల సాగు విధానం
బొప్పాయి తోటల సాగుకు మిట్ట నేలలు అనుకూలం. ఆ పొలాలను ఎంచుకుని దున్నుకోవాలి. డ్రిప్ పద్ధతిలో పైపులను అమర్చుకోవాలి. ఇందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ ఇవ్వగా, బీసీలకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పద్ధతిలో పైపులను అందిస్తున్నది. ప్రతి ఆరు అడుగులకు ఒక అడుగు లోతు గుంత తవ్వి, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న సేంద్రియ ఎరువును వేసి వారం, పది రోజులపాటు మగ్గనివ్వాలి. తర్వాత అందులో మొక్కలను నాటాలి. నాటిన మూడు రోజులకు నీరు పోయాలి. తర్వాత రోజులకోసారి మొక్కలను నీటితో తడిపితే సరిపోతుంది. పిందె దశలో ఉన్నప్పుడు రోజు తప్పించి రోజు నీరు పోస్తే ఆరు నెలల్లో బొప్పాయి పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. ఏడాదిపాటు బొప్పాయి పంట కోతకు వస్తుంది. పది రోజులకొకసారి రైతు బొప్పాయి పండ్లను తెంపి మార్కెట్కు తరలించొచ్చు. మార్కెట్లో పెద్దసైజులో ఉన్న బొప్పాయికి మంచి ధర ఉంటుంది.
బొప్పాయి సాగుతో అధిక లాభాలు
బొప్పాయి తోటలను సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందొచ్చు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు బొప్పాయి తోటలను సాగు చేస్తున్నాం. పంట అధిక దిగుబడికి సస్యరక్షణలు పాటించాలి. వరికి బదులుగా అధికంగా కూరగాయలు, పండ్ల తోటల సాగుపైనే దృష్టి సారిస్తున్నాం.
-కాశమల్ల రాములు రైతు, చౌదర్పల్లి