ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 24 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ర్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి మొదటి విడుత ఎంపికైన లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగి, ఆదర్శంగా నిలువాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ దళితబంధు నోడల్ ఆఫీసర్ ఆర్డీవో వెంకటాచారితో కలిసి మొదటి విడుతలో ఎంపికైన 100 మంది లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో నేటికీ ఆర్థికంగా ఎదుగని కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఏనాడూ దళితుల అభ్యున్నతిని పట్టించుకోని పార్టీలు ఈ పథకాన్ని చూసి ఓర్వలేక విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకంతో ఆర్థికంగా ఎదిగి, విమర్శకులకు బుద్ధి చెప్పాలన్నారు. గడపగడపకూ అభివృద్ధి, సంక్షేమాన్ని అందించేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. లబ్ధిదారులు ఎంచుకోవాల్సిన యూనిట్లపై అధికారులు అవగాహన కల్పించారు. దళితబంధు పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా అందుతుందని తెలిపారు.
త్వరలోనే రెండోవిడుత ఎంపిక
రెండో విడుత లబ్ధిదారుల ఎంపిక కూడా త్వరలోనే ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తరువాత రెండో విడుత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. రెండో విడుతలో నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ జేడీ అంజిలప్ప, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ రఘునందన్‌గౌడ్, ఉద్యానవనశాఖ అధికారి సునందారెడ్డి, ఎంపీపీ కృపేశ్, ఎంపీడీవోలు శ్రీనివాస్, క్రాంతికిరణ్, శ్రీనివాస్, తహసీల్దార్లు అనిత, దేవోజా, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడిగా మహ్మద్ రియాజుద్దీన్
ఇబ్రహీంపట్నంరూరల్ : టీఆర్ఎస్ మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడిగా మండల పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన మహ్మద్ రియాజుద్ద్దీన్ను ఆ పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం నియామకపత్రం అందజేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, నాయకుడు సత్తు వెంకటరమణారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, పోచారం ఉపసర్పంచ్ భగీరథ్, నాయకులు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి
తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమ్మగూడ పరిధి సుందరయ్య నగర్ కాలనీవాసులకు 58, 59 జీవోల కింద ఇండ్ల పట్టాలు ఇప్పించాలని టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి, మున్సి పల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రమావత్ కల్యాణ్ నాయక్ కోరా రు. కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అంద జేశారు. 15 సంవత్సరాలుగా ఇదే కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వ లేదని కాలనీవాసులు వివరించారు. కార్యక్రమంలో రమా వత్ బొడియా నాయక్, గొబ్బూరి కృష్ణ, రాజూగౌడ్, రాజు నాయడు, ఆంజనేయులు, నాగభూషణ్ పాల్గొన్నారు.