హైదరాబాద్: ఈనాడు సంస్థల ఓనర్, మీడియా దిగ్గజం రామోజీరావు మరణం తీవ్ర బాధను మిగిల్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. చెరుకూరి రామోజీ రావు గారు నిజమైన విజన్ ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు. రామోజీ మరణం పట్ల ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో కేటీఆర్ స్పందించారు. రామోజీరావు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని, ఆయన జీవితం స్పూర్తిదాయకం అన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎలా విజయం సాధించాలన్న పాఠాలను రామోజీ జీవితం ద్వారా నేర్చుకోవచ్చు అని కేటీఆర్ అన్నారు. తెలుగు మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఆయన తనదైన ముద్ర వేశారన్నారు. గడిచిన దశాబ్ధ కాలంలో రామోజీ గారిని ఎన్నో సార్లు కలిశానని, ఆయన ఎంతో అప్యాయతను ప్రదర్శించేవారన్నారు. ఆయన చెప్పిన మంచి మాటలు ఎప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. ఈ విపత్కర సమయంలో రామోజీ కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి చెబుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
Very Saddened to learn about the demise of media doyen & a true visionary Sri Cherukuri Ramoji Rao Garu
Ramoji Garu was a self made man whose story is inspirational. His life & his journey is a testament of how one can achieve great success despite all odds. He has left an… pic.twitter.com/hd0yVck0VY
— KTR (@KTRBRS) June 8, 2024