Manchu Manoj | టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం Speed of David Reddy. హనుమరెడ్డి ఎక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. స్టన్నింగ్ మేకోవర్‌తో అదరగొట్టేస్తున్నాడు మనోజ్.
కాగా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు మంచు మనోజ్. ఈ సినిమాలో రెండు కామియో రోల్స్ ఉండబోతున్నాయని.. అందులో ఒకటి మీ స్నేహితుడు శింబు చేస్తుండగా.. మరో రోల్ కోసం రాంచరణ్‌ను సంప్రదించారట.. ? అని రిపోర్టర్ అడుగగా.. మేమింకా ఎవరినీ సంప్రదించలేదన్నాడు మనోజ్.
ఈ సినిమాలో అయితే మంచి పాత్రలు ఉండబోతున్నాయి.. కామియోలకు అవకాశముందంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. మొత్తానికి మంచు మనోజ్ తన సినిమాలో ఇద్దరు స్టార్ యాక్టర్లు కామియో రోల్స్ చేయబోతున్నారంటూ పరోక్షంగా హింట్ ఇచ్చాడా..? అంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరి రానున్న రోజుల్లో దీనిపై ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవిబస్రూర్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మొత్తానికి మంచు మనోజ్ ఈ సారి గట్టి ప్లానే చేశాడని గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
There is a scope for cameos in #DavidReddy. But we didn’t approach the said names. We will announce what is what soon
– #ManchuManoj at Glimpse Launch event pic.twitter.com/PMW6HbrZrA
— BA Raju’s Team (@baraju_SuperHit) December 17, 2025
Rajamouli | ‘అవతార్ 3’ ప్రమోషన్స్- రాజమౌళితో జేమ్స్ కామెరాన్ స్పెషల్ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
Kaantha | కాంత చిత్రానికి థియేటర్లలో ఫ్లాప్ టాక్.. కానీ ఓటీటీలో ఇంప్రెసివ్ రెస్పాన్స్
Tamannaah | క్రేజీ లైనప్.. మరో బాలీవుడ్ ప్రాజెక్టులో తమన్నా