బచ్చన్నపేట, నవంబర్ 17 : ఆదివారం స్టేషన్ ఘనపూర్ లో జరిగిన జనగామ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో జూనియర్ విభాగంలో బచన్నపేట మండల కేంద్రానికి చెందిన శ్రీ రామకృష్ణ విద్యాలయం ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.
పాఠశాలకు చెందిన కటకం లక్ష్మీప్రసన్న, ఇజ్జగిరి దీక్షిత, ఎండీ సమీర్, దాచేపల్లి సృజన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కరస్పాండెంట్ కరికె ఉర్మిళ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు పాఠశాల ప్రసాద్ బాబు, ప్రిన్సిపాల్ నిమ్మ రాంరెడ్డి , పీఈటీ పిన్న మౌనిక, ఉపాధ్యాయులు వేములవాడ భాస్కర్ అభినందించారు.