Ram Charan | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : సినీహీరో రామ్చరణ్ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తన కొత్త వాహనం రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చారు. అందుకు సంబంధించిన డిజిటల్ సంతకం, ఫొటో ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కారు విలువ సుమారు రూ.9.47 కోట్లు. దీనికి టీజీ09 సీ2727 నంబర్ కేటాయించారు. కాగా, హీరో రామ్చరణ్ వెంట జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్, ఆర్టీఓ పురుషోత్తం ఉన్నారు. ఆర్టీఏలో అమలవుతున్న డిజిటల్ సేవలను ఆయనకు వివరించారు.