Prakash Goud | శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 7: పేదవర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోవడంతో వారికి నాణ్యమైన వైద్యమందించాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు త్వరగా చెక్కులు అందించిన్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది బాధిత కుటుంబాలకు దాదాపు 10 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నాయకుడు చంద్రారెడ్డి, నీరటి రాజుముదిరాజ్, మాజీ సర్పంచ్‌లు దండు ఇస్తారి, రమేశ్ యాదవ్, రాజ్‌కుమార్, జిట్టె సిద్ధులు, సహకార సంఘం చైర్మన్ దవాణాకర్గౌడ్, వైస్ చైర్మన్ ప్రభుసాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్‌గౌడ్, నాయకులు కృష్ణ, అశోక్, రాము గౌడ్, ప్రభాకర్ గౌడ్, మల్లికార్జున్, రాజు గౌడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.