జైపూర్ : ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేరును ఇందిరా గాంధీ గ్యాస్ సబ్సిడీ పధకంగా మార్చాలని రాజస్ధాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్లో భారత్ జోడో యాత్ర రాజస్దాన్ మీదుగా సాగిన సందర్భంలోనే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసింది.
ఈ స్కీమ్‌కు అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 12 ఎల్పీజీ సిలిండర్లు రూ. 500కే అందిస్తారు. మోదీ ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇష్టానుసారం పేర్లు మార్చుతుంటే తాము ఉజ్వల పధకం పేరు మార్చితే కాషాయ పార్టీ గగ్గోలు పెడుతోందని కాంగ్రెస్ నేతలు చురకలు వేశారు.
కాగా ఉజ్వల పధకానికి ఇందిరా గాంధీ పేరు పెట్టడం పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం, గాంధీ కుటుంబ ప్రాపకం కోసం ఉజ్వల పధకం పేరు మారుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రమేష్ శర్మ ఆరోపించారు. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు రాలేకపోతోందని ఎద్దేవా చేశారు. వారసత్వ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని, ఈ చర్యలేవీ ఓట్లు రాల్చవని శర్మ పేర్కొన్నారు.
Read More
Amit Shah | అమిత్‌షాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్