గద్వాల, జూలై 26 : ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల వైపు కృష్ణమ్మ అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేయడంతో ఆదివారం ఉదయం ఆ జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏకైక ప్రాజెక్టు అయిన జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 22,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది.
ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరాల ప్రాజెక్టు త్వరలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొనే అవకాశం ఉన్నది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు కాగా ప్రస్తుతం 316. 310 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. ప్రస్తుత ప్రాజెకు ్ట పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.653 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉన్నది. జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో వానకాలం సాగుపై రైతులకు ఆశలు చిగురిస్తున్నాయి.